Mohanlal Begins Filming For Jeethu Joseph’s Mystery Film 12th Man :
మోహన్ లాల్, జీతూ జోసెఫ్.. ఈ కాంబినేషన్ లో సినిమా అంటేనే ఎంతో క్రేజ్. ఎందుకంటే వీరి కలయికలో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అదే ‘ట్వల్త్ మ్యాన్’. ఇది కూడా దృశ్యం మాదిరిగానే మిస్టరీ థ్రిల్లర్. సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. ఇటీవలే ‘రామ్’ పేరుతో మరో ప్రాజెక్ట్ కూడా చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని గ్రీన్ బెర్గ్ రిసార్ట్ లో జరుగుతోంది. 20 రోజుల పాటు షూటింగ్ కొనసాగింది.
ఈ సినిమా కన్నా ముందు మోహన్ లాల్ పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రో డాడీ’ నటించారు. జీతూ జోసెఫ్ సినిమా తర్వాత షాజీ కైలాస్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నారు. ట్వల్త్ మ్యాన్ షూటింగ్ ఆగస్టు 17న ప్రారంభమైంది. ఐదేళ్ల క్రితం అంటే 2016 సెప్టెంబరు 15న పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’లో మోహన్ లాల్ నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతకుముందు దృశ్యం 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ తాజా చిత్రం కూడా ఓటీటీ నుంచే విడుదలవుతుందన్న వార్తలు వస్తున్నాయి. అది కూడా అమెజాన్ ప్రమేయంతోనే అంటున్నారు.
దీన్ని నిర్మాతలు ధ్రువీకరించాల్సి ఉంది. ఆది నుంచి చివరి వరకూ ప్రేక్షకులను కట్టిపడేసే వినోదాత్మక మిస్టరీ చిత్రంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలు ఆరు పురుష పాత్రలు, ఆరు స్త్రీ పాత్రలు ఉంటాయట. ముఖ్యంగా మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కూడా ప్రాంతీయ భాషల్లో పునర్నించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బహుశా తెలుగులో విక్టరీ వెంకటేష్ ఈ సినిమా కూడా చేసే అవకాశం ఉంది.
Must Read ;- మార్వెల్ ‘ఇటర్నల్స్’కు ఎట్టకేలకు మోక్షం











