Box Office Clash Between Pawan Kalyan And NTR :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. అయితే.. ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలివుంది. త్వరలోనే ఆర్ఆర్ఆర్ ప్యాచ్ వర్క్ కంప్టీట్ చేయనన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ఆల్రెడీ అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాని కూడా 2022లో ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.
దీంతో 2022లో ఏప్రిల్ 29న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఎన్టీఆర్ – కొరటాల మూవీ ఓకే రోజున విడుదల చేయనున్నట్టు ప్రకటించినట్టు అయ్యింది. అయితే.. నిజంగానే ఒకే రోజున ఈ రెండు భారీ క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా..? లేక ఒక సినిమా వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.
Must Read ;- పవన్ ‘వీరమల్లు’ తర్వాత హరీష్ శంకర్ తోనే