Pawan Kalyan And Harish Shankar Project Titled As Bhavadeeyudu Bhagat Singh :
ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేర్లన్నీ వైవిధ్యంగానే ఉంటున్నాయి. మొన్న ‘వకీల్ సాబ్’ పేరులోనూ కొత్తదనం ఉంది. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు భీమ్లానాయక్ అనే పేరు పెట్టారు. ఇది కూడా కొత్త పేరే. ఇక క్రిష్ దర్శకత్వంలో సినిమా ‘హరిహర వీరమల్లు’.. ఇందులోనూ వైవిధ్యమే. మరి హరీష్ శంకర్ సినిమా అంటే ఇంకా కొత్తగా ఉండాలి కదా.. అందుకే ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరుకే ఫిక్స్ అయ్యారు. ఈరోజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరును ఇలా నిర్ణయించారు. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మించే చిత్రాలపై అంచనాలు అధికంగానే ఉంటాయి. ఈ సినిమా పేరును ఈ రోజు ఉదయం 9.45 గంటలకు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే..’ ఆధునిక వాహనంపై పవన్ కళ్యాణ్ జీన్స్, జర్కిన్ వస్త్ర ధారణలో ఓ చేతిలో టీ గ్లాస్,మరో చేతిలో మైక్ లాంటిది పట్టుకుని స్టైలిష్ గా కూర్చొని ఉన్నాడు.
‘భవదీయుడు’ అన్న పదం వినయం, విధేయతలు కనిపిస్తాయి. మరి ‘భగత్ సింగ్’ విప్లవ చైతన్యానికి మారుపేరు. ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అని పెట్టడంలో దర్శకుడు ఆంతర్యమేమిటో తెలియాలి. ఈ చిత్రం ఓ లేఖ అయితే.. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనేది ఓ సంతకం అనుకుంటే.. ఆ లేఖలో ఏం రాశారు? ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పబోతున్నారు? లాంటి అంశాలన్నీ ఆసక్తిని, ఆలోచనలు రేకెత్తించేవే. చిత్రంలో సామాజిక అంశాల ప్రస్తావన తప్పని సరా అన్న భావన కలుగుతోంది.
కథాబలం, సన్నివేశాలలో భావోద్వేగాలు, పాత్రలమధ్య సంఘర్షణ, తూటాల్లాంటి మాటలు ఈ సినిమాలో ఉంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది హరీష్ శంకర్ సినిమా కాబట్టి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఒక డైనమైట్ లాంటి హీరో మీద, మరో డైనమైట్ లాంటి పేరు పెట్టి చిత్రం మీద ఉత్సుకతను, అంచనాలను పెంచారు. ‘దిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్ టైన్ మెంట్’ అని ప్రచార చిత్రం లో కనిపించే అక్షరాలు అక్షరాల నిజం అనిపించేలా సినిమా ఉంటుందనుకోవాలి. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ చేసిన హరీష్ శంకర్ సింగ్ అనే పదాన్ని మాత్రం వదిలిపెట్టలేదన్నది అర్థమవుతోంది.
Must Read ;- పవన్ ‘వీరమల్లు’ తర్వాత హరీష్ శంకర్ తోనే