వంద ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే. ఎవరు ఎవరినైనా విమర్శించుకునే సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. జాతీయ నాయకత్వం అండదండలు ఉంటే చాలు… ఏ స్థాయి నేత అయినా తనకు నచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటారు. అయితే ఇప్పుడిదే ఆ పార్టీ పెద్ద నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రెడ్డి గా మారిపోయింది.
ఇద్దరు ఇద్దరే…ఎవరూ తగ్గరే…
పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ పైచేయి సాధించాలని తపన పడుతున్నారు ఆ ఇద్దరు నేతలు. టీపీసీసీ హోదాలో ఇచ్చిన కార్యక్రమాల కంటే ముందే మరో కార్యక్రమం చేపడుతూ ఇటు మీడియా అటు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు రేవంత్. టీఆర్ఎస్ పై ఎదురు దాడి చేయాలన్నా.. నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నా రేవంత్ ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా దూసుకు పోతున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతల్ని కలుపుకొని పోతూ అందరి ఆమోదంతో కార్యక్రమాలు చేపడుతుంటే .. ఇష్యూ బేస్డ్ గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుని కార్యక్రమాలకు నేను సిద్ధం అంటున్నారు రేవంత్. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలుగానే ఉన్నారు. పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలు పాటిస్తుంటే… పార్టీలో యూవ నాయకులు , యూత్ వింగ్ సహకారంతో రేవంత్ దూకుడుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ తీరుపై ఉత్తమ్ తో సహా పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ పై గుర్రుగా ఉన్నారు. టీపీసీసీ అద్యక్ష పదవి కోసం రేవంత్ చేస్తున్న హంగామా సీనియర్లకు తలనొప్పిగా మారుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది.
నిరసనా…నేనూ చేస్తున్నా…
నిన్న జరిగిన కార్యక్రమాల్లోనూ ఇద్దరు నేతలు పోటా పోటీగా నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరసనకు పిలుపునిస్తే… అందుకు అరగంట ముందే గాంధీ భవన్ వేదికగా రేవంత్ మరో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. యూపీలో రాహూల్ గాంధీపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ఉత్తమ్ బీజేపీ కార్యాలయ ముట్టడికి పిలుపు నిచ్చారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టిన రేవంత్ ను గాంధీ భవన్ దాటగానే పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నిరసన కంటే ముందే దీంతో రేవంత్ నిరసన కార్యక్రమం చేపట్టడంపై ఎవరూ నోరు మెదప లేని పరిస్థితి. రేవంత్ ఎపిసోడ్ ముగిసిన తరువాత ఉత్తం కుమార్ రెడ్డి నిరసనకు పోలీసుల అనుమతి లేదని ఆయనను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక సీటు కోసం ఇద్దరు ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు ఎటువైపు దారి తీయనుందో… అధ్యక్ష పీఠం దక్కేదెవరికో? అన్నది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
జగన్ గూబ పగలగొట్టిన ఢిల్లీ ఎన్నికలు…!!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎవరిపై ఎలాంటి ప్రభావాలు చూపాయో తెలియదు కానీ, ఏపీలో...