హీరోలు ఆఫర్లు తగ్గగానే రిటైర్ అయిపోతుంటారు, ఇది టాలీవుడ్ లో బాగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు నిన్నటి తరం హీరోలు మాత్రం ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. అయితే హీరోలుగా రాణిస్తూనే విలన్లుగా నటించే ట్రెండ్ హాలీవుడ్ లో కనిపస్తూ ఉంటుంది. బాలీవుడ్ హీరోలకి కూడా ఇటీవలే ఈ పద్ధతి అలవాటైంది. అమీరఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ వంటి వారు అటు హీరోలుగా నటిస్తూనే విలన్లుగా నటించేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే టాలీవుడ్ లో ఇలా హీరో కమ్ విలన్ వేషాలే వేసేది కేవలం జగపతి బాబు, రానాలు మాత్రమే, అయితే జగ్గు భాయ్ ని హీరోకంటే విలన్ గానే ఇండస్ట్రీ బాగా ఆదరించింది. దీంతో విలన్ గా జగ్గూకి బాగానే ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇదే పద్ధతిని ఫాలో అవ్వడానికి హీరో గోపీచంద్ సిద్ధమవుతున్నాడని తెలిసింది. గోపీచంద్ కి ఆరేళ్లుగా హిట్ లేదు. మనోడు థియేట్రికల్ రైట్స్ కూడా బాగా పడిపోయాయి, నాన్ థియేట్రికల్ రైట్స్ లో హిందీ డబ్బింగ్ రైట్స్ తప్పితే మిగతా వాటిలో కూడా గోపీ చాలా వీక్ గా ఉన్నాడట.
దీంతో గోపీచంద్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంతోనే ఓ స్టార్ హీరో సినిమాతో మళ్లీ తన విలనిజాన్ని ప్రేక్షకులకి చూపించడానికి గోపీ చంద్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. గోపీచంద్ తన కెరీర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రలు పోషించాడు. ప్రభాస్ తో వర్షం, మహేశ్ తో నిజం సినిమాల్లో గోపీచంద్ ప్రతినాయకుడిగా కలిసి నటించాడు.