డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే థియేటర్ లో సినిమాను రిలీజ్ చేయకుండా ఉండటమే. ఈ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ లో సినిమాను ఓటీటీలో అప్ లోడ్ చేసిన నిర్ణీత కాలం తరువాత నిర్మాత అవసరమనుకుంటే థియేటర్ లో రిలీజ్ చేసుకోవచ్చనే క్లాజ్ ఉంటుంది. అయితే ఓటీటీలో ఆల్రెడీ సినిమాను చూసేసిన ఆడియెన్స్ మళ్లీ అదే సినిమాను చూడటానికి థియేటర్స్ కి పెద్దగా రాకపోవచ్చు. దీంతో థియేటర్ లో వచ్చే ఇన్ కమ్ ని కూడా నిర్మాతకు మార్జిన్ ఫిగర్స్ తో కలిపి ఓటీటీలు ముందుగానే చెల్లించేస్తున్నాయి.
అయితే థియేటర్ లో రిలీజ్ చేస్తే వచ్చే రెవెన్యూ తో పోలిస్తే ఓటీటీ వారు డైరెక్ట్ రిలీజులకి ఇచ్చే మొత్తం చాలా తక్కువ. ఉదాహారణకు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 110 కోట్లు. ఈ చిత్రాన్ని నిర్మాతకి 40 కోట్లు లాభం ఇచ్చి 150 కోట్లకు కొనుక్కుంది డిస్నీ హాట్ స్టార్. అయితే ప్రస్తుతానికి నిర్మాతకి 40 కోట్లు లాభం వచ్చిన మాట వాస్తవమే కానీ ఇదే సినిమా థియేటర్ లో విడుదలైతే దాదాపుగా 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసేది అంటున్నారు. అంటే నిర్మాతకి చేతికి దాదాపు 230 కోట్లు వస్తాయి.
మరి డిస్నీ వారు ఇచ్చిన దానికంటే థియేటర్ లో సినిమా రిలీజై హిట్ అయితే మూడింతలు లాభాల్ని ఆర్జించవచ్చు. ఇక తెలుగులో నాని వి సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది ఈ సినిమాకి 28 కోట్లు ఖర్చు అయింది. అమెజాన్ వారు ఈ సినిమాను దాదాపుగా 30 కోట్లకి కొనుక్కున్నారు. అలానే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని 25 కోట్లు ఇచ్చి అమెజాన్ వారు దక్కించుకున్నట్లు సమాచారం.











