సినిమా రంగంలో దర్శకులకు వచ్చే కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతా ఓకే. లేకపోతే ఆ దర్శకుడికి సినిమా కష్టాలే. స్టార్ డమ్ ఉన్నంత కాలం ఇలాంటి తిప్పలు దర్శకులకు తప్పవు. దర్శకుల్ని సంవత్సరాలు పాటు తిప్పుకుని వదిలేసే స్టార్ హీరోల్లో మహేశ్ బాబును మించిన వారు లేరు. మహేశ్ కి మొదటి నుంచి ఓ అలవాటు ఉంది.
మహేశ్ కి ఓ హిట్టిచ్చిన డైరెక్టర్ తో మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. ఇదే రీతిన మహర్షి తరువాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానంటూ మహేశ్ బహిరంగంగా ప్రకటించాడు. ఏకంగా వంశీని ముద్దు కూడా పెట్టేసుకుని మరీ సినిమా కన్ ఫమ్ చేశాడు. దీంతో మహేశ్ తో చేసే సినిమా మీద ఆశలు పెట్టుకుని వేరే హీరోలతో సినిమాలు చేయడం మానేశాడు వంశీ పైడిపల్లి. ఆల్రెడీ 18 నెలలుగా మహేశ్ పిలుపు కోసం వెయిట్ చేశాడు వంశీ. అయితే తాజాగా మహేశ్ తన అప్ కమింగ్ మూవీని పరుశరామ్ తో ప్రకటించే సరికి వంశీ కాస్త ఫీల్ అయ్యాడని వార్తలు కూడా వచ్చాయి.
అయితే మహేశ్ వంశీని పిలిచి పరుశరామ్ తరువాత చేయబోయే సినిమాకి కథ రెడీ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడట. దీంతో వంశీ ‘సర్కారు వారి పాట’ తరువాత తన సినిమానే అని ఫిక్స్ అయిపోయి స్టోరీ రెడీ చేసుకునే పనిలో పడ్డాడట. అయితే మహేశ్ మళ్లీ వంశీకి షాక్ ఇచ్చాడు. తాజాగా అనిల్ రావిపూడి చెప్పిన కథకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్ సినిమా తెరకెక్కుతుందని గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఇక ఇప్పుడప్పుడే మహేశ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో సినిమా చేసేలా లేడనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి.











