ఆంధ్రప్రదేశ్ లో జగన్ గ్రాఫ్ పడిపోతోందా ? ఆయన పార్టీతో పొత్తు కాదు, కనీసం చేతులు కలపడానికి కూడా రాజకీయ పార్టీలు మొగ్గు చూపడం లేదా ? ప్రతిపక్షాల పొత్తు పై అధికార పార్టీ ఎందుకు టెన్షన్ పడుతోంది ? సింగిల్ గా రావాలంటూ రెచ్చకోట్టడం వెనుక వ్యూహమేంటి
ప్రజల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ పడిపోతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అధికారం అంటే బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆయన వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమనే చర్చ కొనసాగుతోంది. అందుకే ఆయనతో కానీ, ఆయన పార్టీతో కానీ కలిసి ప్రయాణం చేసేందుకు ఇతర పక్షాలు ఏవీ మొగ్గు చూపడం లేదట.
వాస్తవానికి తాము పంచుతున్న పథకాలే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని జగన్ అండ్ కో ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయట.జగన్ పాలనలో రాష్ట్రంలో కుంటిపడిన అభివృద్ధి, రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే.. నేరాల కట్టడిలో పోలీసులకు ప్రతిబంధకాలు, ప్రశ్నించే వారిపై ఎదురుడాడులు, అక్రమ కేసులు ఇలా అనేక అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోందట.
మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు కూడా సక్రమంగా జరగడం లేదనే చర్చ బలంగా వినిపిస్తోందట. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామ అని చెప్పుకుంటున్న అమ్మఒడి అమలుకు తాజాగా కొర్రీలు పెట్టిన ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను ఘననీయంగా తగ్గించేసింది.అంతేకాకుండా విద్యా దీవెన, వసతి దీవెన , పెన్షన్ పంపిణీలు కూడా ప్రస్తుతం నామమాత్రంగానే అందుతున్నాయట. దీంతో ప్రభుత్వం తీరపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యిందని టాక్.
ఇక తాజాగా ఏపీలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయని, అక్కడ కరెంట్ లేదు, నీలు లేవు, రోడ్లు బాలేవు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రం ప్రతిష్ఠకు భంగం కలగడమే కాదు, జగన్ పాలనలోని డొల్లతనాన్ని భయటపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. ఈ వరుస పరిణామాలతో ప్రజల్లో తన గ్రాఫ్ పడిపోతోందని వైసీపీ అధినేతకు అర్ధమయ్యిందట. తాజాగా తిరుపతి సభలో జగన్ ముఖ కవళికలు చూస్తే ఆయనలో ఆందోళన మొదలయ్యిందనేది స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారట.
మరోవైపు ప్రజల్లో తాను బలహీన పడుతున్నానని గుర్తించిన జగన్, ప్రభుత్వ వైఫ్యల్యాలకు ఎవరినో ఒకరిని బాధ్యులను చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలను, మీడియాను దుష్టచతుష్టయం అంటూ ఆయన తన ప్రతీ సభలో ఎదురుదాడికి దిగడం ఆయనలోని భయాన్ని స్పష్టీకరిస్తోందట.
ఇదిలా ఉంటే రాష్ట్రపరిస్థితులు మరింత దిగజారిపోకుండా ఉండాలంటే వైసీపీని గద్దె దించడమే మార్గంగా నిర్ణయించుకున్న ప్రతిపక్షాలు సైతం ఒక్కటై పోరాడాలనే నిర్ణయానికి రావడం జగన్ లో మరింత భయాన్ని పెంచేస్తున్నాయట. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఎవరితోనైనా పొత్తుకు సిద్ధం అంటూ జనసేనాని వ్యాఖ్యలు చేయడం జగన్ అండ్ కో ను కలవరపాటుకు గురిచేస్తున్నాయట. ప్రతిపక్షాలను దమ్ముంటే సింగిల్ గా రావాలని రెచ్చకోట్టే ప్రకటనలు చేయడం వెనుక కుట్ర కోణం దాగుందనే చర్చ తెరపైకి వస్తోంది. ప్రధానంగా టిడిపి, జనసేన , బిజెపి మధ్య పొత్తు ఏర్పడే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఎవరికి వారు సొంతంగా పోటీ చేసేలా చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారి మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ఆలోచిస్తోందట.
అదేసమయంలో వైసీపీకి తోడుగా వచ్చే రాజకీయ పక్షాల కోసం తెరచాటు ప్రయత్నాలు చేస్తోందనే చర్చ జోరందుకుంది. అయితే ఏపీ లోని ఏ రాజకీయ పార్టీ కూడా వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవట. అందుకే ఏ పార్టీల మధ్య పొత్తు లేకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారి మధ్య దూరం పెంచి తాము మళ్ళీ అధికారమలోకి రావలానే ఆలోచనలో వైకాపా ఉందనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
మరి రాబోయే ఎన్నికల కోసం వైసీపీ చేస్తున్న కుతంత్రాలు ఫలిస్తాయా ? ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను రూపుమాపుకోగలుగుతుందా ? తెలియాలంటే వేచి చూడక తప్పదు.