విక్టరీ వెంకటేష్.. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్ 3. గతంలో భారీ సక్సెస్ ను అందుకున్న ఎఫ్ 2 కి సీక్వల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా నాటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.
ఈ నెల 27 వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శక నిర్మాతలు అన్నీ ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదల అయినప్పటి నుంచి ఎఫ్ 3 ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రాసతో కూడిన డైలాగులు అందరినీ అలరిస్తున్నాయి. సినిమాలో కామెడీకి కొడవ ఉండబోదనే అంశం ట్రైలర్ తో స్పష్టమవుతోంది.దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన ఫన్ సెగ్మెంట్ ను ఈ చిత్రంలో పండించాడానేది క్లియర్ గా కనిపిస్తోంది.
‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు.. కానీ ఆరో భూతం ఒకటుంది .. అదే డబ్బు’ అంటూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. ‘డబ్బున్నవాడికి ఫన్ .. లేనివాడికి ఫ్రస్ట్రేషన్’. ‘వాళ్లది దగా ఫ్యామిలీ .. మాది మెగా ఫ్యామిలీ’ .. ‘వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. డబ్బు కలిసివస్తుందనే ఆశతో మనీ ప్లాంట్ బిర్యానీ .. మనీ ప్లాంట్ చారు .. మనీ ప్లాంట్ వేపుడు చేసి తినిపించే సీన్ బాగుంది. మెహ్రీన్ బంగారు నగలు పెట్టుకుంటూ ‘ చంద్రముఖి’లా ప్రవర్తించడం నవ్వులు పూయిస్తుంది. ఇక ఈ చిత్రంలో సునీల్ కామెడీ కూడా ప్లస్ కానున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే అనిల్ చెప్పినట్టుగానే, ‘ఎఫ్ 2’ ను మించిన ఫన్ ఈ సినిమాలో ఉండటం ఖాయమనిపిస్తోంది.