ప్రకాశం జిల్లా దర్శిలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొంత మంది ఆవారాగాళ్లను వెంట వేసుకుని నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతున్నాడని మద్దిశెట్టి తీవ్ర విమర్శలు చేశారు. సాఫ్ట్ వేర్ నుంచి వచ్చానని సాఫ్ట్ గా ఉంటానను కుంటున్నాడేమో నా బండ గుండెను బూచేపల్లి తట్టుకోలేడని హెచ్చరించాడు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదని మూడు సార్లు గట్టిగా అరచి చెప్పి బూచేపల్లికి వార్నింగ్ ఇచ్చారు. దర్శిలో పోటీ చేసేందుకు 2019లో బూచేపల్లి ముందుకు రాకపోవడంతో తాను పోటీచేయాల్సి వచ్చిందని నేను ఎవరి సీటు గుంజుకోలేదని మద్దిశెట్టి ఆవేశంగా మాట్లాడారు. ఇరు వర్గాల నేతలు సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చీరాలలోనూ ఎవరికి వారే
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రకాశం వైసీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. చీరాలలో ఆమంచి, కరణం వర్గాలు విడివిడిగా సీఎం బర్డ్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. చీరాల బాలుర హైస్కూల్ గ్రౌండ్ లో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ 48 కేజీల కేక్ కట్ చేసి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆమంచి వర్గం నేతలు భారీగా పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా జగన్ బర్త్ డే వేడుకలు పోటీపోటీగా నిర్వహించారు.











