గుంటూరులో పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. గురజాల నియోజకవర్గం బలహీన, బడుగు వర్గాల సమస్యలు తెలుసుకోవడానికి సమావేశం ఏర్పాటుచేశారు మాజీ మంత్రి యరపతినేని. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై యరపతినేని విమర్శలు గుప్పించారు. 2023 ఎన్నికలలో బదులిస్తామంటూ ప్రతిపక్షాలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని ప్రభుత్వాన్ని ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. అరాచక, అవినీతి ప్రభుత్వమంటూ ఎగతాళి చేశారు. అంతటితో ఆగకుండా సినిమా స్టైల్ తొడకొట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఒక వారాలబ్బాయని వ్యంగ్యంగా మాట్లాడారు.
యరపతినేని విమర్శలను తిప్పికొడుతూ.. కాసు మహేష్ రెడ్డి స్పందించారు. సినిమాలో చూపించనట్టు బాలయ్యలా మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం లాంటి చేసినంతమాత్రానా మిమ్మల్ని చూసి ఎవరూ భయపడరని చెప్పుకొచ్చారు. జమిలీపై ఆశలు చాలని అవి రావడానికి 2025 అవుతుందని, అప్పటి వరకు మా పాలనే ఉంటుందని సమాధానం చెప్పారు.
Must Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!