ఈ సందర్భంగా వెబినార్‌లో హీరోయిన్ నభా నటేశ్ మాట్లాడుతూ, “సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. సినిమా విడుదల తర్వాత నేను ఎందుకు అలా చెప్పానో అర్థమవుతుంది. “ఇస్మార్ట్ శంకర్”లో మాస్ పాత్ర చేశాను. ఈ చిత్రంలో క్లాస్ అమ్మాయిగా నటించాను. ఇంకా చెప్పాలంటే గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రలో కనిపిస్తాను. అయితే ఈ పాత్ర చేయడంలో పెద్దగా నేను ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను దక్షిణాది అమ్మాయిని అయినందువల్ల ఇక్కడి మన సినిమాలే చూస్తూ పెరిగాను. నాటకాల్లో నటించాను. అందువల్ల పాత్రలోకి ప్రవేశించడం నాకు కష్టమేమీ అనిపించలేదు.

తేజ్ నాకు చాలా మంచి స్నేహితుడు. మా దర్శకుడు సుబ్బుకి ఇది తొలి సినిమా. ఈ యూనిట్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. యంగ్ టీమ్‌తో పాటు ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. తమన్ వీనులవిందైన సంగీతాన్ని అందించారు. ఆరు. పాటలు చాలా పాపులర్ అయ్యాయి. అలాగే ఈ చిత్రం ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. సినిమాను ఓటీటీలో చూడటానికి, థియేటర్స్‌లో బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఎంతో తేడా ఉంటుంది..ఎలాగైనా ఈ చిత్రం థియేటర్లల్లోనే విడుదల కానుండటం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు. .
Must Read ;- టెన్షన్ పడుతున్న నిధి అగర్వాల్, నభా నటేశ్











