ఏపీ సీఎం జగన్ రెడ్డి తల్లి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు. ఏపీలో పరిస్ధితి ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పై కూడా నేడు విషం చిమ్ముతున్నారు.
రాజకీయాల్లో మిత్రులు.., శత్రువులు..అంటూ ఎవరు ఉండరు. విలువలు.., సిద్ధాంతాలు అంటూ కూడా ఏమీ ఉండవు. రాజకీయం.. స్వార్ధాలకు వాడుకునే ఒక వస్తువు. దాన్ని అవసరానికి తగ్గట్లు వాడుకోవడం.., అడ్డుగా ఉన్నవాటిని తప్పించి ముందుకు సాగడం నేడు చూస్తున్న రాజకీయం. ఇదే కోవలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లిలాంటి కాంగ్రెస్ ను అడ్డంపెట్టుకుని బంగారపు ఇటుకలు.., వజ్రం అనే ఇసుకతో అవినీతి అనే మేస్త్రీతో ప్లాటినం గూడు నిర్మించి జగన్ రెడ్డికి ఇచ్చాడు.
అలా వచ్చిన ఆ లక్షల కోట్ల విలువైన అక్రమాస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ను వెన్నుపోటు పోడిచాడు జగన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ను తొక్కేందుకు జగన్ రెడ్డికి కేసీఆర్ చేయ్యందించారు. దీంతో రాష్ట్ర విభజన తరువాత ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ కేడర్ ను, నాయకులను జగన్ రెడ్డి..,కేసీఆర్ లు వాటాలు వేసుకుని పంచుకున్నారు. పాలిచ్చి పెంచిన తల్లిలాంటి కాంగ్రెస్ ను ఇరువురు అవహేళన చేసి వెన్నుపోటు పొడిచారు. ఈ శాపమే నేడు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కారణం అవ్వగా.. వచ్చే ఎన్నికల్లో జగన్ పాలిట యమ పాశంలా మారుతోంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఎన్నికల వేళా.. కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి అండ్ కో విషం చిమ్మింది. సొంత ఛానెల్, పత్రికతోపాటు అద్దె మీడియా.., తోక సోషల్ మీడియా, పేటీఎంలో వ్యతిరేక వార్తలను వండి వార్చీ.. కేసీఆర్ కు ఫేవర్ కథనాలు రాసుకొచ్చారు. డబ్బు.., మందిమార్బలను అందించి.., కేసీఆర్ ను అన్నీ విధాలుగా అనుకూలంగా పావులు కదిపారు. కానీ..,విజ్ఞులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
చేయాల్సినంత చేసి.. నేడు రేవంత్ రెడ్డితో మంతనాలు చేయడానికి జగన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. తప్పు తెలుసుకుని చిమ్మిన విషానికి విరుగుడుగా అడుగులు వేస్తూ.. మంతనాలు సాగించాలని చూస్తున్న జగన్ రెడ్డి ఆలోచనలకు రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి.., వాట్ నెక్స్ట్ అనేందుకు తహతహలాడిన జగన్ .. సొంత పత్రికలోని ఓ ప్రతినిధిని సిద్దం చేసి పంపారు. కానీ.. ఆ దూతకు రేవంత్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. జగన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడాలని ఆ దూత కోరగా.. ఏదైన ఉంటే తరువాత చూసుకుందా.. ముందు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వనీయసమాచారం. ఇది చూసిన వారందరూ.. జగన్ రెడ్డి చర్యలు అందితే జుత్తు..లేకుంటే కాళ్ళు అన్న సామెతకు కరెక్టు ఉంటుందని నవ్వుకుంటున్నారు.