ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్థాయిని మర్చిపోతున్నారా. ఇటీవల పలు బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ముఖ్యమంత్రా లేక ఇంకేమైనానా అనేలా ఉంటున్నాయా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి దిగజారీ మాట్లాడుతున్నారనే విమర్శలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలులో జగన్ చేసిన వ్యాఖ్యలపై వస్తున్న స్పందన ఏమిటి ?
ఒక పార్టీ అధినేతగా ఉన్న ఏ వ్యక్తి అయినా రాజకీయాలు మాట్లాడవచ్చు.. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ రాజకీయాలు మాట్లాడితే అది చూసే వారికి జుగుబ్సను కలిగిస్తుంది.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు ఇలానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఇటీవల పల్నాడులో నిర్వహించిన వసతి దీవెన కార్యక్రమంలో, ఆ తర్వాత వాలంటీర్ ల సన్మాన సభ వంటి కార్యక్రమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఫ్రెస్ట్రేషన్ ని బహిర్గతం చేశాయనే చర్చ కొనసాగుతొందట. ఇక తాజాగా ఆయన విపక్షాల పై ఆయన చేసిన వ్యాఖ్యలు తన స్థాయిని తగ్గించేశాయనే వాదన బలంగా వినిపిస్తోందట.
ఒంగోలులో పర్యటిస్తున్న జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రాక్షసులు, దుర్మార్గులతో పోరాటం చేస్తున్నామంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని టీడీపీ, జనసేన అంటున్నాయని,రోజూ దీనిపైనే ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు దత్తపుత్తుడూ ఇదే అంటున్నాడు. ఇలాంటి రాక్షసులు, దుర్మార్గులతో మనం పోరాటం చేస్తున్నాం” అంటూ జగన్ ప్రసంగించారు.
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సిఎంగా ఉన్న జగన్ స్థాయిని మరిచి ఎక్కడ పడితే అక్కడ రాజకీయం మాట్లాడడం సిగ్గుచేటు అనే వాదన ఒకవైపు వినిపిస్తుండగా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ , ప్రత్యేక పరిస్థితులతో ప్రజల్లో తన పాలనపై నెలకొన్న వ్యతిరేకత నుంచి ప్రజల ఆలోచన మరల్చాలనే ఒక దురుద్దేశ్యంతోనే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ మరోవైపు జరుగుతోంది.
జగన్ ఒంగోలు పర్యటన నేపధ్యంలో సిఎం కాన్వాయ్ కి వాహనం కావాలంటూ ఓ కుటుంబాన్ని అధికారులు రోడ్డున నిలబెట్టి వారి వాహనాన్ని తీసుకెళ్లిన ఘటణ పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్త చర్చ జరుగుతోంది. ఇక విజయవాడలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటణ కూడా సంచలనంగా మారింది.. ఇలాంటి పలు ఘటనలతో పాటు రాజకీయంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని గుర్తించిన జగన్ ప్రజల ఆలోచనలను మరల్చాలనే ఆలోచనతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.