బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కు కోపం వచ్చింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఆయన అక్కడే ఉన్న ఓ యువకుడిని చితకబాధాదు.అయితే ఇందులో మైక్ టైసన్ తప్పు లేదట, తప్పంతా ఆ యువకుడిదేనట. మైక్ టైసన్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా ప్రయాణించేందుకు జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. కాగా అదే విమానంలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ఓ యువకుడు మీ టైసన్ ను తెగ విసిగించేశాడట. వెనుక సీటులో కూర్చున్న ఆ యువకుడు పదే పదే మాట్లాడుతూ తెగ చిరాకు తెప్పించాడు. దీంతో మైక్ టైసన్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఆ యువకుడిని తనతో మాట్లాడవద్దని మైక్ టైసన్ మొఖం మీద చెప్పినా వినకుండా ఊరికే వాగుతూ ఉన్నాడు.
ఆ యువకుడు అలాగే మాట్లాడుతూ టైసన్ ను విసిగిస్తూ ఉండడంతో మైక్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మొదట అతడిని తిట్టినా , ఆ యువకుడు పట్టించుకొకపోవడంతో మైక్ అతడి సీటు వద్దకు వెళ్లి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆ యువకుడి ముఖానికి గాయాలయ్యాయి.ఈ ఉదంతాన్ని చూస్తున్న తోటి ప్రయాణికులు యువకుడిని వారించి టైసన్ ను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.











