జగ్గారెడ్డి నిష్క్రమణ నిజమేనా?
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగా.. మరో ఆరునెలల్లో ఏదో ఎన్నికలు మొదలవుతున్నట్లుగా రాజకీయ పార్టీలన్నీ అటెన్షన్ మూడ్ లోకి వచ్చేశాయి! ఇందులో భాగంగానే జాతీయవాద రాజకీయాలు, పార్టీలు మారడం, ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు గుడ్ బై చెప్పేందుకు యత్నాలు వంటివి తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగానే జగ్గారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి! అసలు జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయాల్సిన అగత్యం ఏం పట్టిందో అన్న చర్చలు ఊపందుకున్నాయి! అయితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్నట్లు అందుతున్న సమచారం! నేడు ఆయన రాజీనామా చేస్తున్నారని ప్రచారం ఊపందుకుంది! ఈ రోజు( శనివారం ) మధ్యాహ్నం జగ్గారెడ్డి రాజీనామా చేసి, లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది! అయితే తన రాజీనామా తరువాత ఏ పార్టీలో ఆయన చేరుతారన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
గుడ్ బై చెప్పడానికి కారణాలివేనా?
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. మున్సిపల్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీ తరుఫున ఒకసారి, కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు సంగారెడ్డి శాసన సభకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వహిస్తున్నాడు కూడా! సిట్టింగ్ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జగ్గన్న నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని మీడియాలో చర్చ మొదలైంది! వాస్తవానికి టీపీసీసీ ఎంపిక సమయంలో రేవంత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది అన్న సమాచారం అందిన నాటి నుంచే జగ్గారెడ్డి పార్టీ నిర్ణయాలతో విభేదించారు. అంతేకాక నేటికి రేవంత్ వ్యవహారశైలిని, నిర్ణయాలను తప్పుబడుతూనే వస్తున్నారు. అయితే ఈ క్రమంలో రేవంత్ ఆర్మీ, మరికొన్ని పేర్లతో వెలసిన సోషల్ మీడియాలో జగ్గారెడ్డిపై దుష్ప్రచారం ప్రారంభమైంది. అలానే టీఆర్ఎస్ పార్టీ కోవర్టు అంటూ చేస్తున్న చేస్తున్న కామెంట్స్ జగ్గారెడ్డిని తీవ్ర మనోవేధనకు గురిచేశాయి. తన వ్యక్తిగతాన్ని డ్యామేజ్ చేసేలా తనపై పోస్ట్ లు పెట్టడం, కోవర్టునంటూ వెటకారంగా మాట్లాడం తీవ్ర మనస్తామనికి గురిచేస్తోందని జగ్గన్న కేడర్ తో చెప్పుకుని వాపోయినట్లు సమాచారం! ఇదిలా ఉంటే జగ్గారెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతారని తమకు పూర్తి సమాచారం ఉందని, రేవంత్ ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు, ఎత్తుగడలు పారకనే వేరే దారి వెతుకుంటున్నాడని రేవంత్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ సీనియర్లు ఉత్తమ్, భట్టి, బోసురాజులు ఉన్నట్లు తెలుస్తోంది!
Must Read:-సభ్యత్వ నమోదు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహం! 2 లక్షల జీవిత బీమా, రాహుల్‌తో సన్మానం!!