మత్స్యకారులు అభ్యన్నతిని మరిచారు..
ఏపీలో మత్స్యకారుల అభ్యున్నతి మరిచారు. అందుకే అడ్డుగోలు జీవోలను తీసుకొచ్చి వారి వెన్నువిరిచే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఎంతమేరకు జనసేన సహించదని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మత్స్యకార అభ్యున్నతి సభ’ లో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను నెరవేర్చడానికే వైసీపీకి అధికారం ఇచ్చారు. అంతేకాని వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టెందుకు కాదు అని ఆ పార్టీ నాయకులు గమనించుకోవాలని సూచించారు జనసేనాని పవన్! మంచి పాలన అందించి అన్ని రంగాలవారి ఆర్థిక అభివృద్ధికి కోసం భరోసాగా నిలవాలి తప్ప చేపలు, మటన్, చికెన్ దుకాణాలు నడపడానికి కాదని ఆయన ధ్వజమెత్తారు. 32 కులాలతో 500 పైగా తీరప్రాంత గ్రామాల్లో నివాసం ఉంటున్న మత్స్యకారుల జీవన పరిస్ధితులపై జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బకొట్టారని మండిపడ్డారు.
జీవో 217ను వ్యతిరేకిస్తున్నాం.. అమలకు సహించేది లేదు!
మత్స్యకారుల జీవన విధానానికి గొడ్డలిపెట్టుగా ఉన్న జీవో 217ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా చెప్పారు. మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 ను తక్షణమే విమరించుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీకి కనీసం 10 అసెంబ్లీ స్థానాలైన ప్రజలిచ్చి ఉంటే.. ప్రజావ్యతిరేక జీవోలను చించేపారేస్తామని పవన్ హాజరైన నర్సాపురం బహిరంగ సభలో జీవో ప్రతులను చింపేశారు. జీవో కాపీలను చింపినందుకు జైలుకు పంపించినా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు ఆన్లైన్ చేసి, మందస్తు 25 శాతం డబ్బులు చెల్లించమంటే మత్స్యకారులకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి. జీవో రద్దు పోరాటానికి మీరు ప్రణాళికలు చెప్పండి నేను రోడ్డుపైకి వస్తానని మత్స్యకారులలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దేశంలో ఎక్కడ లేని జీవోలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల జీవనోపాధిలపై జగన్ రెడ్డి దెబ్బకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార అభివృద్ధికి జనసేన పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
Must Read:-జగన్ నిర్ణయాలు.. మత్స్యకారులకు శాపాలు!











