జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు ఎలా సాధ్యం!
కొత్త పీఆర్సీ ప్రకారం నూతన వేతనాలు వేస్తున్న వేళ పాత జీతాలు ఎలా సాధ్యమౌతుందని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను అంశాల వారీగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన తెలిపారు. చర్చలు సయయంలో ఉద్యమం అంటే ప్రతిష్టంభన ఏర్పాడుతుందన్నారు. చలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతుందని ఉద్యోగులు చెప్పారని, ఉద్యోగుల కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోదన్నారు. చలో విజయవాడ కార్యక్రమం కంటే ముందే సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. జీతాల్లో ఎక్కడ రికవరీ లేదన్నారు. ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్మెంట్ మాత్రమేనని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణలోకి తీసుకుని, తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంత్రుల కమిటీ ముందు ఉద్యోగులు ప్రతిపాదనలు..
మంగళవారం సాయంత్రానికి కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల వేస్తామని మంత్రులు కమిటీ తేల్చి చెప్పింది. దీంతో పీఆర్సీపై ఏపీ మంత్రులు కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. ఈ చర్చల్లో మంత్రుల కమిటీ ఎదుట మూడు ప్రతిపాదనలు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉంచారు. ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రులు కమిటీ చర్చించి మళ్లీ చెబుతామని మంత్రులు కమిటీ పేర్కొంది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచించింది. అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరింది. పీఆర్సీ జోవోల రద్దు, పాత జీతాలు వేయాలని స్టీరింగ్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని మంత్రులు కోరారు. అయితే సమస్య పరిష్కారం తర్వాతే తమ కార్యచరణపై చర్చిస్తామని స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జీతాల విషయంలో తొందర ఎందుకని స్టీరింగ్ కమిటీ ప్రశ్నించింది. అయినా సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ పేర్కొంది.
Must Read:-పాత జీతాలివ్వడం సాధ్యం కాదు..! కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదు!!