ఏపీ అవినీతిపై జనసేన శంఖారావం పూరించింది. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేలా రోజుకొక అవినీతి బాహ్య ప్రపంచానికి చూపేలా నాదెండ్ల మనోహర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో అమలవుతున్న ప్రతి స్కిమ్ ను స్కాంగా మార్చి జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అవినీతిని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సాక్ష్యాలతో సహా బయటపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకలో జరిగిన 120 కోట్ల అవినీతిని సాక్ష్యాలతో సహా ఆయన మీడియాకు వివరించారు. నాడు నేడు పేరుతో విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చాం అని చెబుతున్న జగన్ రెడ్డి.. అందులో జరిగిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మనోహర్.
విద్యాకానుకలో ఇచ్చే మెటిరియల్ ను ఢిల్లీ.., ఉత్తర ప్రదేశ్ లోని ఒక ఐదు కంపెనీలకు మాత్రం కంట్రాక్టులు కట్టబెట్టి.. దోచుకున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 45 లక్షల మంది విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు.., బూట్లు తదితర మెటిరియల్ ను ఆ ఐదు కంపెనీల నుంచి తీసుకున్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధుల సంఖ్య 35 లక్షల మంది కాగా.. మరి ఆ 10 లక్షల మెటిరియల్ ఎందుకు ఆర్డర్ పెట్టారు.. వాటిని ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
దాదాపు 5 కంపెనీలకు 2, 400 రూపాయలు కట్టపెట్టింది జగన్ రెడ్డి ప్రభుత్వం. దీంతో ఈడీ ఆ ఐదు కంపెనీలపై దాడులు చేయగా.. దాదాపు 120 కోట్లు అవినీతికి పాల్పడ్డట్లు గుర్తించి.. కేసు నమోదు చేశారు. మొత్తంగా 120 కోట్లు అవినీతి జరిగిందని గుర్తించిన ఈడీ.. మని ట్రైల్స్ జరిగిన విధానాన్ని పరిశీలిస్తోంది. దీనినే జనసేన ఫోకస్ చేసింది. నాశిరకం బ్యాగులను, బూట్లును ఆర్డర్ పెట్టి.. వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారని మనోహర్ విమర్శించారు. అసలు విద్యాశాఖకు లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టి.. ఒక్క రూపాయి కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని ఆరోపించారు.