తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనా బంగారు తెలంగాణ సాధ్యం కాలేదని టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ సీఎం కావాలనే ఆశతో, వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో పంపాలి
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు జేసీ. బాబుకు ఒక్క పేజీలోనే నోటీసులు ఇచ్చారని, అదే జగన్‌కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో పంపాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నోటీసులు రావడం తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. దొనకొండ లేదా విశాఖను రాజధాని చేయాలని తాను సూచించామన్నారు. కానీ చంద్రబాబు అమరావతివైపు మొగ్గు చూపారని.. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదన్నారు.
Must Read ;- సిల్లీ కేసులతో చంద్రబాబును భయపెట్టలేరు : టీడీపీ నాయకులు