అక్రమ కేసులు, నోటీసులతో బాబును భయపెట్టలేరని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టులు చెప్పినా వైసీపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీడీపీ నాయకులు అన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిందన్నారు. టీడీపీ నాయకులు అచ్చెనాయుడు, గల్లా జయదేవ్, బుద్ద వెంకన్న, సోమిరెడ్డి, వర్ల రామయ్యలు వైసీపీ సర్కారు తీరుపై ఫైర్ అయ్యారు. నోటీసులతో చంద్రబాబుకు ఏం కాదని ధీమా వ్యక్తం చేశారు.
కక్ష సాధింపే..
దళితులకు మేలు చేయడం కోసమే చంద్రబాబు పాటుపడుతున్నారని, అనవసర ఆరోపణలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుతోందన్నారు. కేవలం కక్ష సాధింపు తోనే నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాగైన చంద్రబాబుపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లాడని.. తన దారిలో అందరూ జైలుకు వెళ్లాలనే జగన్ ఆలోచన కరెక్ట్ కాదని టీడీపీ నాయకులు అన్నారు.
Must Read ;- కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు : నారా లోకేష్