ఇప్పుడు ప్రతి చానెల్‌లో ఇదే చర్చా కార్యక్రమం. టీడీపీకి ఫ్యూచర్ లేదా.. అయిపోయినట్లేనా.. అంతేనా అంటూ ప్రశ్నలు.. అవునన్నట్లు సమాధానాలు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూపిస్తూ.. టీడీపీ, చంద్రబాబు .. అవుట్ డేటెడ్ అన్నట్లే కథనాలు వస్తున్నాయి. ఇక రోజా మేడమ్ అయితే ఒక అడుగు ముందుకేసి టీడీపీని OLX లో పెట్టుకోమని ఉచిత సలహా ఒకటి విసిరిపారేసింది. వీరంతా చరిత్ర మర్చిపోతున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసి ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తున్నారంటే.. వీళ్లు నిజంగానే హిస్టరీ పక్కన పెట్టేస్తున్నారనిపిస్తోంది. అంతేలే గెలుపు ఉత్సాహం వారి మెమరీని లేపేసినట్లుంది.
అప్పుడు కాంగ్రెస్ పరిస్ధితి ఏంటి?
ఒకప్పుడు ఢిల్లీలో వాజ్ పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు.. కాంగ్రెస్ పరిస్ధితి ఏంటి? అంతా ఇవే మాటలు మాట్లాడారు. అయిపోయింది కాంగ్రెస్ పని.. ఇక ఫ్యూచర్ లేదన్నారు. కాని ఏమైంది? బీజేపీ ఫెయిలవటంతో.. మళ్లీ కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఇక్కడ అది కాంగ్రెస్ గొప్పతనం కాదు.. బీజేపీ ఫెయిల్యూర్.. ప్రజల్లో వ్యతిరేకత వస్తే.. అవతలోడు మూల కూర్చున్న ముసలాడు అయినా సరే తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారు. యూపీఏకు కూడా అదే అనుభవం ఎదురైంది. సంకీర్ణ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా జరగటంతో… జనానికి చిరాకు పుట్టింది.. మళ్లీ బీజేపీ పరిస్ధితి ఏంటో అని అనుమానించినవారికి.. జనం మళ్లీ వారికి గ్రాండ్ విక్టరీ అందించి.. ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. బీజేపీ స్ట్రాంగ్.. కాంగ్రెస్ పని అయిపోయిందని.. కాని ప్రైవేటీకరణ వైపు దూసుకుపోతున్న మోదీ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోంది. అది లెవెల్ మారిందంటే.. కాంగ్రెస్ మళ్లీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Must Read ;- ఎన్నికల వేళ.. మోదీ సర్కారుకి రైతు సంఘాల ఊహించని షాక్
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి పవర్‌లోకి రాగానే..
అలాగే రాష్ట్రంలో కూడా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి పవర్ లోకి రాగానే.. టీడీపీ పని అయిపోయిందన్నారు. చంద్రబాబు ఇక కోలుకోలేడు అన్నారు. కాని తర్వాత జరిగిన పరిణామాలు చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పచెప్పాయి. అలాగే చంద్రబాబు గెలిచాక.. జగన్ మళ్లీ కోలుకోవడం కష్టమన్నారు. కాని ఏమైంది? జగన్ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు జగన్ అభిమానులు కూడా అదే వాదన చేస్తున్నారు. ఇక జగనే సీఎంగా ఉంటాడని.. ఇక టీడీపీ లేవలేదని చెప్పుకుంటున్నారు.
మాస్‌కు రాష్ట్ర సమస్యలు కనిపించడం లేదు
కాని జగన్ చేసే తప్పులే టీడీపీకి శ్రీరామరక్ష అని చెప్పుకోవాలి. మూడు రాజధానులను జనం పట్టించుకోలేదని వాదిస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా. కాని ప్రత్యక్ష బాధితులు మాత్రమే పోరులో ఉంటున్నారు. మిగిలినవారంతా తమ అభ్యర్ధి ఏ కులం.. ఎంత డబ్బు ఇచ్చాడు.. ఇదే చూసుకున్నారని స్థానిక ఎన్నికల ట్రెండ్ చూస్తేనే అర్ధమవుతోంది. అధికార దుర్వినియోగం జరిగినా.. పోలీసులను ప్రయోగించినా.. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి.. వైసీపీకి మాస్‌లో ఉన్న అభిమానం ఇంకా తగ్గలేదు. వారికి రాష్ట్ర సమస్యలు పెద్ద సమస్యలుగా కనిపించడం లేదు.
ప్రస్తుతానికి కరోనా కవర్ చేసినా..
కాని జగన్ ఫెయిల్యూర్‌ని ప్రస్తుతానికి కరోనా కవర్ చేసినా.. ఆ ఫెయిల్యూర్ ప్రభావం ఎకానమీపై పడి.. అది గ్రామాలను తాకాకే.. అందరూ రియలైజ్ అవుతారు. ఆ పరిస్ధితి రావడానికి ఇంకా టైమ్ పడుతోంది. అంతేగాని టీడీపీ టైమ్ ఏమీ అయిపోలేదు. జగన్ వైఫల్యమే టీడీపీకి 2019 ఎన్నికల తర్వాత ఊపిరి అందించింది. అలాగే అదే ట్రెండ్ కొనసాగి.. మళ్లీ టీడీపీ టైమ్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని అయిపోయిందనుకోవడం పొరపాటు.
Also Read ;- జగన్ మరింత స్పీడు అవుతారా.. మున్ముందు మరింత దారుణం?