కరోనా బాధితుల జాబితాలో జూనియర్ ఎన్ టీఆర్ సైతం చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలంటూ నారా చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు నాయకులు, హీరోలు ఆకాంక్షించారు. జూనియర్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా కౌతాళం మండలం మెళిగనూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిమానులు పూజలు చేశారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని 100 టెంకాయలు కొట్టారు. చర్చీలు, మసీదుల్లో సైతం జూనియర్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు.
Must Read ;- ఎన్టీఆర్ ఆరోగ్యంపై చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు












