ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన కేసుపై విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది.బెయిల్ రద్దు విషయంలో జగన్ తరపు న్యాయవాదులు కొంత సమయం కోరారు. ఇప్పటికే రెండు వారాలకుపైగా సమయం ఇచ్చామని,ఇదే ఆఖరి అవకాశమని సీబీఐ న్యాయమూర్తి చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు కేసును ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు ప్రకటించింది.ఆలోగా జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.
ఇప్పటికే రెండు వారాలు అవకాశం ఇచ్చాం..
జగన్ బెయిల్ రద్దుపై కౌంటరు దాఖలు చేసేందుకు ఇప్పటికే రెండు వారాలకుపైగా సమయం ఇచ్చామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీరియస్ అయినట్టు తెలుస్తోంది.ఇదే ఆఖరి అవకాశమని న్యాయమూర్తి జగన్ తరపు న్యాయవాదులకు చెప్పినట్టు తెలుస్తోంది.దీంతో సాధ్యమైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
Must Read ;- రఘురామ కేసులో మరో మలుపు.. సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్











