దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుండటం.. జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో మోదీ సర్కార్ పై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేధావులు, మీడియా కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయని ఓ గుజరాతీ కవయిత్రి కవితారూపంలో పదునైన అస్త్రం సంధించారు. తన కన్నీటినే సిరా చేసుకొని అక్షరాలుగా మార్చారు. దేశంలోని దయనీయ పరిస్థితిని కళ్లకు అద్దినట్టి వర్ణించారు. ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం.. ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది, ధుఃఖితులు మాత్రం మిగిలారు. అంతా కోల్పోయి మిగిలాం.. బరువైన మాటలతో కవిత ఆస్ర్తాన్ని సంధించారు. పలువురు మేధావులు, రచయితలు ఆమె కవితను అభినందించగా, బీజేపీ నాయకులు కవయిత్రి ఖక్కర్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితులు, పాలకుల నిర్లక్ష్య వైఖరిని చాలా చక్కగా కవితరూపంలో వ్యక్తం చేయడంతో.. ఈ కవిత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కవితలోని కొన్ని వాఖ్యాలు
భయపడకు..ఆనందపడిపో..
ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి
ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం
ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది,
ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,
ఓ రాజా..బతికించే వాళ్ళు లేరు,
శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,
ధుఃఖితులు మాత్రం మిగిలారు
అంతా కోల్పోయి మిగిలాం
మాటలు లేక బరువెక్కిన మా హృదయాలు శోకగీతాలైనాయి
ప్రతి ఇంటిలో మృత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది
ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది
ఓ రాజా..కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్ మమ్మల్ని కబళించేస్తోంది
ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హృదయాలు ముక్కలయ్యాయి
అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది
బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి
ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది
ఓ రాజా..నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు
ఓ రాజా..ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి
ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,
రా..బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,
దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు
ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు
కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి,
Must Read ;- ప్రైవేట్ కు వెళ్లలేని పేదల పరిస్థితి ఏంటి..? : ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం











