నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. తిరిగి ఈమధ్యనే ప్రారంభం అయిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్యపై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు బోయపాటి.
ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనపడతారని సమాచారం. ఆయన సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు ప్రగ్యా జైస్వల్ కాగా మరొకరు పూర్ణ. అయితే తాజాగా ఈ చిత్రంపై ఒక సరికొత్త అప్డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఇందులో మొదటి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒక పవర్ ఫుల్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నదని సమాచారం. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఈమధ్యనే బాలయ్య – ప్రగ్యా జైస్వల్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి.
ప్రజలకు మేలు చేస్తున్న బాలయ్యకు ఆమె అండగా నిలబడే పాత్రలో ప్రగ్యా జైస్వల్ కనిపిస్తుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో బాలయ్య ఊర మాస్ గా కనిపించి అభిమానుల్ని అలరించారు. అందుకే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నేపథ్యంలో మూడో సినిమా కూడా చరిత్రని సృష్టిస్తుందని నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి వారి నమ్మకాలను బోయపాటి ఏ రేంజ్ లో నిలబెట్టుకుంటాడో చూడాలి.











