కాంతారా ప్రభంజనం ఆగడం లేదు. ఐఎండీబీ మాత్రం ఆ సినిమాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐఎండీబీ టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో కాంతారాకు 1వ ర్యాంకు లభించింది. నిన్నటిదాకా ఈ స్థానంలో రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ ఉండేది. ఆ స్థానాన్ని కాంతారా ఆక్రమించింది. ఇప్పుడు రాకెట్రీ మూడో స్థానానికి పడిపోయింది. నిన్నటిదాకా 36వ ర్యాంకులో ఉన్న కాంతారా అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. పైగా ఇది కన్నడ మూవీ. ఈ మధ్య కన్నడ చిత్రాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బీ శెట్టిలను ట్రిపుల్ ఆర్ గా పిలుస్తుంటారు. కాంతారా ఫలితాలు చూసి రిషబ్ షెట్టి పేరు మార్మోగుతోంది. 8.5 పాయింట్లతో కాంతారా అగ్రస్థానానికి చేరుకుంది. రెండో స్థానంలోద రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ రామా ఉంది. నాలుగో స్థానంలో కమల్ హాసన్ నాయకుడు ఉంది. 6వ స్థానంలో హాంకీ పాంకీ, 7వ స్థానంలో జైభీమ్, 8వ స్థానంలో చార్లీ 777 చిత్రాలు ఉన్నాయి.
ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రం సీతారామంను కూడా కాంతారా దాటేసి అతి తక్కువ సమయంలో అగ్రస్థానానికి చేరుకుంది. కలెక్షన్ల పరంగానూ కాంతారా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 16 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇటీవల విడుదలైన యష్ కేజీఎఫ్ 2 మాత్రం 136వ ర్యాంకులో ఉంది. భారీ వసూళ్లు సాధించిన కేజీఎఫ్ ను దాటేసేందుకు కాంతారా సిద్ధంగా ఉంది. ఈ రెండు చిత్రాల హీరోలు కన్నడ భాషకు చెందిన వారే కావడం విశేషం.