‘ఖైదీ, తంబి’ సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు తమిళ హీరో కార్తి. తాజా చిత్రం ‘సుల్తాన్’ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన మనోడు.. నేటి నుంచి ఆ సినిమా డబ్బింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో కూడిన ఫోటోస్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మేకర్స్. శివ కార్తికేయన్ తో ‘రెమో’ తెరకెక్కించి మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు భాగ్యరాజ్ కణ్ణన్ ‘సుల్తాన్’ కు దర్శకుడు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్.ఆర్. ప్రభు ఈ సినిమాను నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘సుల్తాన్’ మూవీతో కన్నడ భామ రష్మికా మందణ్ణ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని తొందరగా పూర్తి చేసి .. థియేటర్స్ లోనే విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా కార్తికి ఏ రేంజ్ లో హిట్టిస్తుందో చూడాలి.
#Sulthan dubbing has begun.
See you all soon! #JaiSulthan @Karthi_Offl @iamRashmika @Bakkiyaraj_k pic.twitter.com/q8xNLOJHVr— DreamWarriorPictures (@DreamWarriorpic) October 16, 2020











