కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెళ్లటానికి ఢిల్లీ వెళ్లాడు.. మొక్కటానికి నడుం వంచి మొక్కాడే గాని.. పైకి లొంగినట్లు కనపడుతూనే.. బిజెపికి ఎలా చెక్ పెట్టాలనే ఆలోచనల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ దెబ్బలతో మైండ్ బ్లాక్ అయింది.. ఏం చేయాల్రా బాబూ అనుకుంటుండగానే.. పాపం నోముల నర్సింహయ్య చనిపోయాడు.. వారినీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలొస్తే టీఆర్ఎస్ పరిస్ధితి ఏంటా అని అందరూ చర్చించడం మొదలెట్టారు.
ఇప్పుడు ఆ విషయంపైనే కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నోముల నరసింహయ్య ఫ్యామిలీకే ఇస్తారని మొదట ప్రచారం జరిగినా.. దుబ్బాక దెబ్బకు కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారంట. అందుకే దుబ్బాకలో చేసినట్లు ఇక్కడ చేయకుండా.. గట్టి క్యాండేట్ ని పెట్టాలని డిసైడ్ అయ్యారంట. ఆయనెవరో కాదు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా గతంలో ఎంపీగా చేశాడు.. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. పైగా ఫైనాన్షియల్ గా ఫుల్లు స్ట్రాంగ్.. గెలుపు తప్పదన్నట్లు.. ఆయననే సెలెక్ట్ చేశారంట కేసీఆర్.
అయితే మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ఈ నిర్ణయానికి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డికి వద్దని ఆయన రకరకాల కారణాలు కేసీఆర్ కి వినిపిస్తున్నారంట. గుత్తా కనక గెలిస్తే.. మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని.. అప్పుడు జిల్లాలో తన పరపతి తరిగిపోతుందనే భయంతోనే జగదీష్ రెడ్డి అడ్డం పడుతున్నాడనే టాక్ వస్తోంది.
ఏమైనా కేసీఆర్ ఒకసారి ఫిక్స్ అయితే ఇక వెనక్కు తగ్గరు కాబట్టి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైనలనే అనుకోవాలి. మరోవైపు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఆల్ మోస్ట్ అయిపోయినట్లే. అప్పుడు జానారెడ్డి తన కొడుక్కి బిజెపి టిక్కెట్ కన్ ఫామ్ చేసేసుకుంటారని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నా.. కొడుకుని మాత్రం బిజెపిలోకి పంపిస్తారంట. కొడుకు రఘువీరే సాగర్ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తారని అంటున్నారు. కాని బిజెపి నుంచి మరో అభ్యర్ధి గట్టిగా ప్రయత్నించడమే కాకుండా అనధికారికంగా క్యాంపెయిన్ చేసేసుకుంటున్నారు. అయినా జానా ఓకె అంటే అవన్నీ జాంతా నై.
రేపు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే.. కాంగ్రెస్ నుంచి కూడా గట్టి క్యాండేట్ దిగే అవకాశముంది. అప్పుడు ఖచ్చితంగా నాగార్జునసాగర్ లో ట్రయాంగిల్ ఫైట్ తప్పదు. దుబ్బాక, గ్రేటర్ లా కాకుండా సాగర్ లో ఖచ్చితంగా ట్రయాంగిలే జరుగుతుందని అనుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పటికైతే టీఆర్ఎస్ క్యాండేట్ మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డే.. గిదైతే ఫైనల్.