కొడాలి నాని నోటి సంగతి రాష్ట్రమంతా తెలుసు. ఆ నోరు కాస్త ఎస్‌ఈసీ పైన కూడా చూపించాడు. ఇంకేముంది.. మునుపు పెద్దిరెడ్డికి ఇచ్చిన షాకే కొడాలి నానికి కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఎన్నికల ముగిసేంద వరకు నోరెత్తదంటూ ఆదేశాలు జారీ చేసింది. మన మంత్రి గారు ఊరికే ఒప్పేసుకుంటారా ఏంటి? నేను కోర్టులో తాడో పేడో తేల్చుకుంటానంటూ.. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణ చేపట్టిన కోర్టు.. మంత్రి గారి వీడియో చూసిన తర్వాత విచారణ జరిగి.. తీర్పు వెలువరిస్తామని చెప్పింది. అందుకోసం కేసును రేపటికి వాయిదా వేసింది.
హైకోర్టులో కొడాలి తరపు లాయర్ మాట్లాడుతూ, ఎస్ ఈసీ, కమిషనర్ పై నాని ఎలాంటి ఆరోపణలు చేయలేదని చెప్పుకొచ్చారు. వేరే వాళ్ల వ్యాఖ్యలతో మంత్రి గారివి పోల్చి చూడలేమని కోర్టుకు విన్నవించారు. దీనికి సమాధానమిచ్చిన ఎస్ ఈసీ లాయర్.. వీడియో ఫుటేజీ పరిశీలించాల్సిందిగా కోర్టును కోరారు. ఎస్ ఈసీ విన్నపాన్ని అంగీకరించిన కోర్టు, కేసును రేపటికి వాయిదా వేస్తూ.. నాని మాట్లాడిన వీడియోను పరిశీలించిన మీదట తదుపరి విచారణ చేస్తామని తెలిపింది.