తెలంగాణ ప్రభుత్వంపై కోదండరాం మరోమారు సమర శంఖారావం పూరించారు. తెలంగాణ ఉధ్యమంలో కీలక బాధ్యత పోశించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలాలపై మరోమారు అన్ని వర్గాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ వయసులోనూ 48 గంటల దీక్షకు దిగడమే ఓ సాహసం. అందులోనూ అన్ని మరచి తనకు మద్దతు ఇవ్వాలంటూ ప్రతి ఒక్కరిని స్వయంగా వెళ్ళీ ఆహ్వానించారు . తాను చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వడంతో పాటు భవిష్యత్ లో తనకు పోరాటానికి మద్దతివ్వాలంటూ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. గత కొంత కాలంగా కోదండరాం ప్రజల నుండి దూరమైన వ్యక్తి అయ్యారు. ఇక ఆయన తాజాగా తీసుకున్న స్టెప్ తో తనకు పూర్వ వైభవం ఖాయం అన్న భావనలో ఉన్నారు ఆయన.
తెలంగాణ ప్రజా సమస్యలపై మరోమారు పోరు..
తెలంగాణలో కరోనా కాలం నుండే ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కోరాన కష్టాలు, వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా చూసారు. ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని.. కరోనా, వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం బరోసా ఇవ్వాలంటూ అనేక మార్లు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రప్రభుత్వం నుండి కనీస స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు కోదండరాం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వరంగల్, ఖమ్మం,నల్లగొండ జిల్లాల్లో వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన కలిసిన వివిధ వర్గాల ప్రజలు తమ ఇబ్బందులు , ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఉపాది కోల్పోయిన నిరుద్యోగులు ఇలా అనేక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఆయన ప్రభుత్వంపై మరోమారు పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీక్షను చేపట్టారు కోదండరాం.
అన్ని పక్షాలతో కలిసి పోరు ఉదృతం..
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ఆయనకు అన్ని పార్టీలు , పక్షాలతో పరిచయాలున్నాయి. జేఏసీ చైర్మన్ గా సుదీర్ఘ ఉధ్యమం నడిపిన ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇప్పటికీ అనేక మంది సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని విపక్షాలు సహా అన్ని వర్గాలు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కొదండరాం చెబుతున్నారు. వారందరినీ ఏక తాటిపైకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళణలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇక కోదండరాం చేపట్టిన దీక్షకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. వీరంతా కోదండరాం వెంటన నడిచేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించారు. దీంతో రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన ఉధ్యమాలను చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చిన ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇప్పటికే ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది అని అది దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటారని …. ఇంకా మొండికి పోతే మరింత పతనం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి కేసీఆర్ కోదండరాం దీక్షకు స్పందిస్తారా.. కోదండరాం అనుకున్న విధంగా ఉధ్యమతీవ్రత పెంచుతారా.. అందుకు ఆయన అనుకున్నట్టు అన్ని వర్గాలు కలిసి వస్తాయా వేచిచూడాలి.
Also Read: టీఆర్ఎస్‌ను ముంచేస్తున్న ఐఏఎస్‌లు ఎవరు?