నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులపై దురుసుగా వ్యవహరించారంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం ఆరుగంటలకే పోలీసులు కొల్లు రవీంద్ర నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించాడంటూ కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లు అరెస్టుతో అతని వర్గీయులు పెద్ద ఎత్తున మచిలీపట్నంలోకి కొల్లు నివాసానికి చేరుకున్నారు.
అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళన
అక్రమ అరెస్టును నిరసిస్తూ కొల్లు రవీంద్ర వర్గీయులు మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. నిన్న ఓటు హక్కు వినియోగించుకున్న కొల్లు రవీంద్రను మీడియాతో మాట్లాడకుండా తోసి వేసి పోలీసులే అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రిపై లుపోలీసు అసభ్య పదజాలం వాడటంతో పాటు, తోసి వేశారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మరలా రివర్స్ కేసులు పెట్టడం దారుణమని వారు ఆందోళన చేస్తున్నారు. కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును పలువురు టీడీపీ సీనియర్ నేతలు ఖండించారు.
also read : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్..