కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు, సానుభూతిపరులు.. ముహూర్తాలు చూసుకొని మరీ మాట్లాడుతున్నారు. లేటెస్ట్‌గా మాజీ ఎంపీ.. వైఎస్ జగన్ శ్రేయోభిలాషి.. ఉండవల్లి అరుణ్ కుమార్.. మేరా నంబర్ ఆగయా అంటూ.. దిష్టీ మ్యాటర్ మీద దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ అలా ఎలా మాట్లాడతారని మొదలుపెట్టి.. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించకూడదు అనే ఉచిత సలహా ఒకటి ఫ్రీగా ఇచ్చి పడేశారు.
అయితే ఈ విషయంలో ముందు బీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇతర కాంగ్రెస్ నేతలు స్టార్ట్ చేశారు. వాళ్లూ తగ్గిపోయిన తర్వాత.. ఇప్పుడు ఏపీకి చెందిన ఉండవల్లి అరుణ్‌కుమార్.. ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు ముగిసిపోయిన అంశం అని.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మరుసటి రోజే ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ మ్యాటర్‌లో సలహాలు, సూచనలు.. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం.. జనసేన శ్రేణుల్లో సందేహాలు రేకెత్తిస్తోంది. వైఎస్ జగన్ శ్రేయోభిలాషి అని చెప్పుకొనే ఉండవల్లి… పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా టార్గెట్ చేయడం వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి.. పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడానికే… ఈ అంశాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచాలని… కొందరు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని కన్‌ఫామ్ చేస్తున్నాయి. మొత్తం కోనసీమకు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు గానీ… రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది దిష్టి పవన్ కళ్యాణ్‌కు తగిలిందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు











