ఈసారి ఆస్కార్ బరిలోకి ఇండియా తరఫున చాలా చిత్రాలు పోటీ పడుతున్నాయి. వీటిలో కుజంగల్ ను ఎంపిక చేశారు. ఆస్కార్ కు పంపేందుకు ఆస్కార్ అవార్డు సెలక్షన్ కమిటీ 14 చిత్రాలను పరిశీలించింది. మార్చి27, 2022న ఈ అవార్డులు జరుగుతాయి. వీటిలోంచి ఒక్క చిత్రాన్ని మాత్రమే ఎంపిక చేయాలి. ఆ ఒక్కటి కుజంగల్. ఇది తమిళ సినిమా. మిగతా 13 సినిమాలను ఇది వెనక్కి నెట్టేసింది. సర్దార్ ఉదమ్, షేర్నీ, మండేలా, తూఫాన్, కాగజ్, ఆటవెల్ జాలీ, చలో షో, నయాట్టు, గోదావరి, లైలా ఔర్ సత్ గీత్, బ్రిడ్జి తదితర చిత్రాలను పరిశీలించాక కుజంగల్ ను ఎంపిక చేశారు. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
ఈ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. 50వ రాటర్‌డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక టైగర్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాని నయనతార, ఆమె స్నేహితుడు విఘ్నేశ్ శివన్ కలిసి నిర్మించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఇది తెరకెక్కింది. మన చిత్రాలు ఆస్కార్ వరకూ వెళ్లినా చివరికి అవార్డు దక్కించుకోవడంలో మాత్రం వెనకే ఉంటున్నాయి. ఈసారి ఏంజరుగుతుందో చూడాలి.











