సింగర్ మంగ్లీ పాట పాడిందంటే.. ఆ పాట సూపర్ హిట్టే.. ఆ.. బొమ్మ బ్లాక్ బస్టరే. ఇటీవల నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో సారంగదరియా సాంగ్ ఓ సెన్సేషన్. రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేసింది ఈ పాట. ఈ పాటకు సుద్దాల సాహిత్యం అందించగా మంగ్లీ ఆలపించారు. మంగ్లీ పాట పాడితే.. ఆ పాటలో ఊపు ఉంటుంది. ఆడియన్స్ ని షేక్ చేస్తుంటుంది. లవ్ స్టోరీ చిత్రానికి మంగ్లీ పాడిన సారంగదరియా సాంగ్ హైలైట్ గా నిలిచింది. సినిమా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.
అలాగే మంగ్లీ పాడగా యూత్ ని షేక్ చేసిన మరో సాంగ్ అల.. వైకుంఠపురములోని రాములో రాములో సాంగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన అల.. వైకుంఠపురములో చిత్రంలోని రాములో రాములో సాంగ్ అంత సక్సస్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్ నృత్యం – మంగ్లీ గాత్రం. అలాగే ఈ పాట రాసిన రచయిత. ఈ రెండు పాటలే కాదు.. రంగ్ దే సినిమాలో ఊరంతా.., క్రాక్ మూవీలో భూమ్ బద్దలు.., అల్లుడు అదుర్స్ చిత్రంలో రంభా, ఊర్వశి, మేనక, జార్జిరెడ్డిలో బుల్లెట్ సాంగ్.. ఇలా మంగ్లీ పాడిన పాటలు.. బ్లాక్ బస్టర్స్ అయిన ఆ పాటల గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే.. అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో. మొదటి సినిమా అయినప్పటికీ.. నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, పవన్ కేసి, రూపిక, ఇందు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాను లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు కుంచం శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిల్ బ్రో పబ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్షకులు నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేశారు. మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెరసీ ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది. మరి.. ఈ సాంగ్ కలిసొచ్చి చిల్ బ్రోకు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.











