అమరావతి రైతు గోడు ఆలకించండి!
మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి సాహాసోపేత నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఆ చట్టలపై దేశ వ్యాప్తంగా రైతులు సంఘాల, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. ప్రతిఘన, నిరసనలు వ్యక్తమయ్యాయి. మూడు సాగుచట్టాలని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును 2020 సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. నవంబర్ 26, 2020 నుంచి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ .. పంజాబ్, హర్యానా రైతులు ఉద్యమ బాట పట్టారు. ఈ ఉద్యమానికి 40 కి పైగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అనేక చర్చలు, ప్రతిచర్చలు ఫలించకపోవడంతో ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని శుక్రవారం ప్రకటించారు. అంతేకాక ఎంతో హుందగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు. ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ఆహ్వానించతగ్గ రాజకీయాలు. దేశంలో దాదాపు 24 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజాపా అధినేత, దేశ ప్రధాని హోదాను మరిచి రైతుల కోసం దిగివచ్చి క్షమాపణ చెప్పడంతో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీని అభినందిస్తున్నారు. మనస్పూర్తిగా మోదీ గొప్పతనాన్ని ఒప్పుకుని సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు నెటిజన్లు. మోదీ సంచలనాత్మక నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కూడా ఆహ్వానించి, అభినందించారు. ఏపీలో రైతు సంక్షేమానికి చేయవల్సిన పనులపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను రాష్ట్రానికి త్యాగం చేసి, 700 రోజులకు పైగా దీక్షలు చేస్తున్న వారి గోడును ఆలకించాలని అభ్యర్థించారు. న్యాయస్థానం టూ దేవస్థానం వరకు చేస్తున్న మహాపాదయాత్రకు 13 నుంచి పెద్దఎత్తున సంఘీభావం వస్తోందని చంద్రబాబు లేఖ ద్వారా మోదీకి వివరించారు.
ఏపీ అభ్యున్నతికి అమరావతి రాజధాని అవసరం!
ఏపీ అభ్యున్నతికి అమరావతి రాజధాని అవసరమని ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించారు. 30 వేల ఎకరాలకు పైగా రాజధాని ఉండాలని, అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతునిస్తున్నట్లు ఆనాడు ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తో సహా అందరూ సభ్యులు ప్రకటించిన వారే. అమరావతి రాజధానిగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రైతులిచ్చిన భూముల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి సమకూర్చి .. ఎంతో దార్మినికతతో 13 జిల్లాల అభివృద్ధికి బాటలు వేయాలని కాంక్షించిన చంద్రబాబు కల నేడు మూడు ముక్కాలాటలో కొట్టుకుపోయిందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో యువత భవిష్యత్తు ముడిపడి ఉన్న రాజధాని అంశాన్ని తేల్చకుంటే ఏపి ఇంకా ఆర్థికంగా వెనుకబడే ప్రమాదం లేకపోలేదు. ప్రధాని స్థాయిలో మోదీ సాగుచట్టాలను వెనక్కితీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏపి వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
Must Read ;- రైతు జీవితంతో రాజకీయలా? సిగ్గు సిగ్గు..!











