సూపర్ స్టార్ కృష్ణ తన పుట్టిన రోజు వేడుకను ఇంట్లో తన శ్రీమతి సమక్షంలో జరుపుకున్నారు. కేకు కట్ చేసి తన భార్య ఇందిరకు తినిపించారు. చాలా అరుదైన దృశ్యమిది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మరెందరో సినీ ప్రముఖులు కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన ఇంటి ఆవరణలో మొక్కలు కూడా నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆయనకు ట్విట్టర్ ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇచ్చిన పిలుపుమేరకు కృష్ణ సోమవారం నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం సంతోషకరమైన విషయమని కొనియాడారు. ఆయన చేస్తున్న కృషికి తాను మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. గతంలో కూడా తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన సంగతిని గుర్తుచేశారు.
Must Read ;- బుర్రిపాలెం ప్రజలకు మహేష్ బాబు టీకాలు