టీఆర్ఎస్ కీలక నాయకుడు,తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబీకుడు,రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని పేర్కొంటూ ప్రధాని మోదీ లేఖ రాశారు.పచ్చదనం,పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణ,మొక్కల పెంపు,చెట్ల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా స్ఫూర్తి నెలకొల్పిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తాను ఎంతో సంతోషించానని పేర్కొంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు.కాగా మోదీ రాసిన లేఖపై జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందిస్తూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రకృతిని పూజించడం భారతీయ సంస్కృతిలో భాగం..
కాగా మోదీ రాసిన లేఖలో ప్రకృతిని పూజించడం భారతీయ సంస్కృతిలో భాగంగా ఉందని,భారతీయుల జీవితాల్లో అది అంతర్భాగంగా ఉందని,అత్యున్నత సంప్రదాయాల్లో భాగమని పేర్కొన్నారు.మనమందరమూ భూమాత పిల్లలమేనని, ప్రకృతితో సహజీవనం,సమన్వయం మన జీవనమార్గం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.పర్యావరణ పరిరక్షణతోనే ప్రకృతిపరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్నిఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు.వాతావరణ కాలుష్యాన్నితగ్గించేందుకు,కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ,నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు.
యువత ‘వృక్షవేదం’చదవాలి
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా లక్ష్యాలను,ఉద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన పుస్తకం ‘వృక్షవేదం’పైనా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు.పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించిన ఈ పుస్తకం అందరినీ కదిలించేలా ఉందని,ప్రతి ఒక్కరూ,ముఖ్యంగా యువత ఈ పుస్తకాన్నిచదివి,పర్యావరణ,ప్రకృతి ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమం మరింత వేగాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
నాలుగు విడతల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అభినందిస్తూ లేఖ రాసిన ప్రధాని మోదీకి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ప్రధాని మోదీ ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్నిమరింత ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.పచ్చదనం పరిశుభ్రత,మొక్కలు నాటడం,చెట్ల పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.మొత్తం నాలుగు విడతల్లో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా పూర్తి చేశారు.టాలీవుడ్ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు,ప్రముఖులను భాగస్వాములను చేయడం ద్వారా పలువురిలో స్ఫూర్తిని రగిలించారు.సామాన్య ప్రజనీకంతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలకు ఈ ఛాలెంజ్ విసరడం ద్వారా ప్రముఖులను భాగస్వాములుగా చేశారు.పార్టీలకు అతీతంగా కూడా కొందరు రాజకీయ నాయకులు ఈ ఛాలెంజ్‌కు స్పందించిన సందర్భాలూ ఉన్నాయి.
Must Read ;- దిగజారిన మోదీ ప్రతిష్ట.. ఎందుకో తెలుసా?
What a way to start the day Sir! Immense pleasure to have your kind words for #GreenIndiaChallenge and your valuable message for #VrikshaVedam. This adds sanctity to the cause. It would be great if you could kindly participate in #GIC to take a giant leap in India & world over🙏. pic.twitter.com/MamlULov4h
— Santosh Kumar J (@SantoshKumarBRS) May 28, 2021











