చాలామంది జాతకాల్లో రాహుకేతు సంబంధమైన దోషాలు ఉంటుంటాయి. అలాగే కాలసర్పదోషం ప్రభావం కూడా ఆయా రాశుల మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీ నుంచి మళ్లీ కాలసర్పదోషం ప్రారంభమవుతోంది. అసలు కరోనా రావడానికి కాలసర్పదోషమే కారణమని అనేకమంది జ్యోతిష్కులు కూడా అంటున్నారు. ఇలాంటి దోషాలు పోవాలన్నా, రాహుకేతువుల అనుగ్రహం పొందాలన్నా ఆ పరమశివుడికి లక్షబిల్వార్చనలో పాల్గొంటే చాలు. ఆ అవకాశం ఈ నెల 13వ తేదీ హైదరాబాద్ లోని పటాన్ చెరు ప్రాంతంలో కలుగుతోంది.
ఇక్కడ కొలువైన శ్రీశ్రీశ్రీ సోమార్క సహస్ర లింగేశ్వరస్వామి ఆలయంలో ఆరోజు లక్షబిల్వార్చన జరగబోతోంది. నవ నాగక్షేత్రమైన ఈ ఆలయంలో ఈ నెల 13 తేదీ ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకే ఈ లక్షబిల్వార్చన ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సాగుతుంది. గత రెండేళ్లుగా ఇక్కడ ఈ లక్షబిల్వార్చన జరుగుతోంది. ఇది మూడో ఏడాది. కరోనా అని సందేహించకుండా మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలతో ఇందులో పాల్గొంటే మంచిది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద వీడియో కూడా చూడండి.
Also Read: తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే!