గతేడాది భారతీయ సినీ సంగీత ప్రియుల్ని దుఃఖ సాగరంలో ముంచి అమరలోకానికి తరలి వెళ్ళిపోయారు గాన గంధర్వుడు యస్పీబాలు. తెలుగు వారితో పాటు అన్నిభాషల ప్రేక్షకులకు ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. అయితే వారంతా సంతోషించదగ్గ ఒక శుభవార్త ఏంటంటే.. బాలుని పద్మ విభూషణ్ అవార్డు వరించి తరించింది.
కేంద్ర ప్రభుత్వం 2021 వ సంవత్సరానికి గాను పద్మ అవార్డుల్ని ప్రకటించింది. మొత్తం 119 మందికి పద్మఅవార్డులు దక్కాయి. ఏడుగురికి పద్మవిభూషణ్, పది మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వారిలో దివంగత గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇది మన తెలుగు వారికి గర్వకారణమే అయినా.. ఆ అవార్డు ఆయన బతికున్నప్పుడు వచ్చి ఉండుంటే.. ఆయన అభిమానులు మరింతగా సంతోషించేవారు.
Elated at the announcement of 'Padma Vibhushan' to my beloved brother SP Balu garu. Most deserving honor. Pained to see the suffix 'posthumous' in brackets. Wish he was here to personally accept it! #SPB pic.twitter.com/4835H8C5xP
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021











