ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు!
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులతో బ్రతుకుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. సాక్షి దినపత్రికపై లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీని విచారణ నిమిత్తం విశాఖ 12వ అదనపు జడ్జి కోర్టుకు ఆయన గురువారం హాజరయ్యారు. 6/2020 నెంబరుతో దాఖలైన వాజ్యంలో తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో సాక్షి దిన పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని లోకేష్ మీడియాకు తెలిపారు. జగన్ అనుకూల పత్రిక తనపై, తన తండ్రి చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల సహాయంతోనే వివేకానంద రెడ్డిని హత్య చేశారని ఆయన ఆరోపించారు.
సాక్షితో పాటు డెక్కన్ క్రానికల్ పై కూడా పరువు నష్టం దావా!
‘చినబాబు చిరుతిళ్లు అనే శీర్షికతో సాక్షి, డెక్కన్ క్రానికల్ లో వార్త రాశారని.. సాక్షిపై రూ. 75 కోట్లు, డెక్కన్ క్రానికల్ రూ.25 కోట్ల పరువు నష్టం దావాను విశాఖ జిల్లా కోర్టులో దాఖలు చేశారు నారా లోకేష్. ఈ నెల 28న, వారికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. తనను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తలు రాస్తున్నారని, తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికీ జరగకుండా ఉండేలా న్యాయ పోరాటం చేస్తానని వివరించారు. శాసన సభ సాక్షిగా తన అమ్మ భువనేశ్వరి క్యారెక్టర్ ను దూషించారని, నేను కూడా వైయస్ విజయమ్మ, భారతి కోసం, వారి కుమార్తె పై వ్యాఖ్యలు చేయవచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డువస్తోందని లోకేష్ చెప్పకొచ్చారు. శాసన సభలో మాట్లాడిన ప్రతిఒక్కరూ 2024 తరువాత క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టనని ఆయన చెప్పారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారని లోకేష్ వివరించారు.
Must Read:-వివేకాను చంపింది ఆ నలుగురే..! నేనే కళ్లారా చూశా! ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం!!