దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన “ఎస్.ఎం.ఎస్.” చిత్రం ద్వారా రెజీనా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అనంతరం“రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్“‘ వంటి పలు సినిమాలు చేసింది. గతేడాది అడవి శేష్ హీరోగా రూపొందిన “ఎవరు ” చిత్రంలో నటనకు ఎక్కువగా అవకాశం ఉన్న పాత్రలో రెజీనా మెప్పించింది. అయినా ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు ఆమెకు అందని ద్రాక్ష పండును గుర్తుకు తెస్తున్నాయి.
బాలీవుడ్ తర్వాత టాలీవుడ్డుకే అధిక ప్రాధాన్యం ఉండటంతో తెలుగులో తనకు సినిమాలు సన్నగిల్లడం రెజీనాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయట. అయితే తమిళంలో నాలుగైదు చిత్రాలు చేస్తుండటం ఆమెకు కొంతలో కొంత ఊరటనిస్తోంది తమిళంలో విశాల్ సరసన “చక్ర” చిత్రంలోనూ, సెల్వ రాఘవన్ దర్శకత్వంలో హారర్ కథా చిత్రంలోనూ, ఇంకా అరవిందస్వామి నటిస్తున్న చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలలో రెజీనా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు అవకాశాలు మళ్లీ తన దరిచేరతాయని ఆమె ఆశిస్తోంది. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా సరదాగా తన చిన్ననాటి న్యూడ్ ఫోటోలను ఆమె పోస్ట్ చేసి అందరికీ ఒక్కసారి షాక్ ఇచ్చింది.
Must Read ;- ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా