సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నభారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే… మహేష్ బాబుకి కరోనా రావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
పరశురామ్ మాత్రం మహేష్ బాబు లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… మహేష్ కి కరోనా రావడంతో… సర్కారు వారి పాట కంప్లీట్ అవ్వడానికి ఆలస్యం అవుతుందని సమాచారం. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ చేయనున్న మూవీ స్టార్ట్ కావడానికి మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మహేష్, త్రివిక్రమ్ 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే.. మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి.
అయితే.. అభిమానుల ఎదురు చూపులకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే… త్రివిక్రమ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ పోస్ట్ ప్రొడక్షన్స్ ని ముగించి మహేష్ స్క్రిప్టు పై దృష్టి సారిస్తున్నారని తెలిసింది. భీమ్లానాయక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులుచివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ తో మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్నాయి. కరోనా వైరస్ నుండి కోలుకున్న తర్వాత థమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు. అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మహేష్, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.