తీన్మార్ మల్లన్న… నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినప్పటికీ, ప్రజల మనసు గెలిచాడు. చివర రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు పోటీ ఇచ్చారు. మల్లన్న ఓటమి చెందినప్పటికీ, అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి వరకు పోరాడిన యన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. యుద్ధం ఇంకా మిగిలే ఉందనే సంకేతాలు ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కార్ పై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ ను ఫాంహౌజ్ ను పంపించేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
సాగర్ బరిలో అమీతుమీ
త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న రెండోస్థానంలో నిలిచి, విజయం అంచుల దాకా వెళ్లారు. అదే ఉత్సాహంతో నాగార్జున సాగర్ బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే విషయంపై ఆయన దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న కనుక, సాగర్ బరిలో నిలిస్తే ఉప ఎన్నిక ఇక రసవత్తరంగా మారడం ఖాయం.
Also Read : మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక అభిమాని ఆత్యహత్య











