మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ .. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ పై తన ఫోకస్ షిఫ్ట్ చేయ బోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా స్ర్కిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా .. కన్విన్సింగ్ గా మార్పులు చేర్పులు చేశారట. ఒరిజినల్ మూవీ సోల్ మిస్ అవకుండా.. చిరు ఇమేజ్ తగ్గట్టుగా తెలుగు వెర్షన్ తెరకెక్కబోతోంది.
మొన్నామధ్యనే ‘లూసిఫర్’ రీమేక్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. అన్నీ కుదిరితే .. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఆరునెలల్లోనే ఈ సినిమా ను కంప్లీట్ చేయాలని దర్శకుడు మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన కేస్టింగ్ ఎంపిక ప్రక్రియ మొదలవుతుందట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి మాటలు లక్ష్మీ భూపాల రాస్తున్నారు.
Must Read ;- మెగాస్టార్ ‘ఆచార్య’ తో సల్లూభాయ్ ‘రాధే’ ఢీ











