నల్లగొండలో ఓ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద తోపులాట, కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్, నల్లగొండలో షురూ అయ్యింది. అయితే నల్లగొండలో జరుగుతున్న ఓ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హాల్ నెంబర్ ఆరు గది తాళాలు తెరిచినట్టు,బాక్సుల తాళాలు పగులకొట్టారని సీపీఐ అభ్యర్థి ఆరోపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సీపీఐ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై కార్యకర్తలను నిలువరించారు.
ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించడంతో అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటిసారి జంబో బ్యాలెట్ ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా నడుస్తోంది.
Must Read ;- ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 50 ప్లస్ వన్ ఫార్ములా.. అందుకే ‘ప్రాధాన్యత’ ప్రాణప్రదం










