మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. దీని తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’ మలయాళ మూవీ తెలుగు వెర్షన్ నూ లైన్ లో పెట్టుకున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ను ఆచార్య కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే.. ‘లూసిఫర్’ రీమేక్లో హీరోయిన్ క్యారెక్టర్ లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హీరోయిన్ క్యారెక్టర్ ను యాడ్ చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ముందుగా అందాల తార నయనతార పేరు వినిపించింది. దాదాపు నయనతార కన్ ఫర్మ్ అంటూ… త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమె మరెవరో కాదు త్రిష. గతంలో చిరంజీవి సరసన త్రిష ‘స్టాలిన్’ సినిమాలో నటించింది.
నిజానికి ఆచార్య సినిమాలో ముందుగా త్రిషనే అనుకున్నారు. చిరు, త్రిష లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్న టైమ్ లో ఈ మూవీ నుంచి తప్పుకున్నాను అంటూ ప్రకటించి షాక్ ఇచ్చింది త్రిష . అది వివాదస్పదం అయ్యింది. అయితే.. ఇప్పుడు ‘లూసీఫర్’ రీమేక్ లో త్రిష నటించబోతోంది అంటూ గట్టిగా టాక్ వినిపిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి సంభాషణలు అందిస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా త్రిష ఈ సినిమా నటిస్తుందా..? లేక రూమరా.? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- ఆచార్యను ఎదుర్కొనే పవర్ఫుల్ విలన్ ఇతగాడే!