పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ మెడలో నల్లటి కండువా వేసుకుని ఆమె నిరసన చేపట్టారు. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారంటూ ఈసీ 24 గంటల పాటు మమత ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఈ రోజు రాత్రి 8 గంటల వరకు ప్రచారం చేయవద్దని సూచించింది. దీన్ని నిరసిస్తూ మమత దీక్ష చేపట్టారు.
Also Read:- CEC గా సుశీల్ చంద్ర.. రేపు బాధ్యతల స్వీకరణ











