మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో సిద్ధ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో సిద్ధ పాత్రను రామ్ చరణ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిద్ధ పాత్ర నక్సలైట్ గెటప్ లో కనిపిస్తుంది. కాకుపోతే ఈ పోస్టర్ లో మాత్రం సిద్ధుడి చేతిలో ఓ యువతి ఒదిగిపోయింది. ట్విట్టర్ లో ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ ‘ఆయుధమైనా …అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది.’ అనే కామెంట్ చేశారు.

ఈ పాత్రకు ఓ లవ్ స్టోరీ కూడా సినిమాలో ఉంటుందని ఈ పోస్టర్ తెలియజెపుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా మే 13న విడుదల కావలసి ఉంది. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని విడుదల వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జూన్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అధికారికంగా ఆ వివరాలు వెల్లడించలేదు. ఇందులో రామ్ చేతిలో ఒదిగిపోయే భామగా పూజా హెగ్డే నటించింది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది.
రామ్ చరణ్ కు సంబంధించినంత వరకూ ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలవుతాయన్న మాట. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ట్రిపుల్ ఆర్ అక్టోబరు 13న విడుదల కానుంది. ఈలోగా ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాల సేపు ఉంటుందని సమాచారం. ఆచార్యలో మరో నటి రెజీనా కూడా ఓ పాటలో కనిపిస్తుందట. పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు.
ALSO READ:‘ఆచార్య’ ఫస్ట్ సింగిల్ : అదే గ్రేస్ తో వింటేజ్ మెగాస్టార్











