తమిళ దర్శకుడు శంకర్ ఇంట పెళ్లి జరగబోతోంది. శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు అదితి, ఐశ్వర్య, ఒక కుమారుడు అర్జిత్ ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె అదితికి గత ఏడాది నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ బిజినెస్‌మేన్ కుమారుడితో అదితి వివాహం వచ్చే వారం పొలాచ్చిలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాహం ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరుగనుంది. లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా తొలగించిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే యోచనలో శంకర్ ఉన్నారు.
ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఆమె వివాహం ఖాయమైందని అంటున్నారు. కరోనా కారణంగా వీరి వివాహ వేడుకను నిరాడంబరం నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగనుంది. పెళ్లి తేదీపై ఇంకా స్పష్టత లేదు. పెద్ద కూతురి వివాహం తర్వాత ఈ వివాహం జరిగే అవకాశం ఉంది.
శంకర్ కుమార్తె ఐశ్యర్య డాక్టర్. రోహిత్ టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్ అనే సంగతి తెలిసిందే. ఇక రోహిత్ తండ్రి దామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ జట్టుకు స్పాన్సరర్ కూడా. అయితే గత మేలో శంకర్ తల్లి ముత్తు లక్ష్మీ కన్నుమూసింది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నారు. దీనితో పాటు హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ రీమేక్ కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు.











